బీసీల వ్యతిరేకి బీజేపీ…

169
dasyam
- Advertisement -

బీసీల వ్యతిరేకి బీజేపీ అని మండిపడ్డారు చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్. దేశ వ్యాప్తంగా బీసీలందరూ ఓబీసీకి చెందిన ప్రధాని మోడీ ఎదో చేస్తారని ఆశగా ఎదురు చూశారు..ఎనిమిది యేళ్లుగా ఈ ఆశలను మోడీ అడియాశలు చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కలిసి మాట్లాడిన దాస్యం.. మోడీ మిగతా వర్గాలతో పాటు బీసీలకు కూడా ఏంచేయలేకపోయారన్నారు.

అన్ని వర్గాలు మోడీపై అసంతృప్తిగా ఉన్నాయన్నారు. బీసీలకు బీజేపీ బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదు… ఓబీసీ మంత్రిత్వ శాఖతో పాటు బీసీ గణన విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసం కేంద్ర మంత్రిగా ఆనాడే పీఎం మన్మోహన్ సింగ్ పై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారన్నారు. ఆనాడు కాంగ్రెస్ పట్టించు కోలేదు.. ఇపుడు బీజేపీ కూడా బీసీ సమస్యల పై స్పందించడం లేదన్నారు.

కేంద్రం బీసీలకు ఏం చేయలేదు.. మరో వైపు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు మేలు చేసే చర్యలు తీసుకున్నారన్నారు. బీసీల కోసం 300 కు పైగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. బీసీ విద్యార్థులకు ఉద్యోగాల సాధన కోసం భారీగా బీసీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయక పోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్ల కు కేంద్రం గండి కొడుతోందన్నారు. బీసీ పారిశ్రామికవేత్తలపై కేంద్రం కక్ష గట్టి ఈడీ దాడులు చేయిస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -