కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కాజిపేటకి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదు అనడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఆయన ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్‌లతో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ కాజిపేటకి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదు అనడం ఎంతవరకు సమంజసం ?.. 70ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన సందర్భలు ఉన్నాయి. అన్ని రాజకీయ, ప్రజలతో కలిసి కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాకర్టీ కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాది. అదేవిదంగా రాష్ట్రానికి రావల్సిన ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యక్టరీ కోసం పోరాటం చేస్తామన్నారు.
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక రాజకీయ పార్టీలు పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇతర రాష్టలకు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్టానికి కోచ్ ఫ్యాక్టరీ రాదనడం చాలా బాధాకరం అన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్రం నుండి 60 శాతం రెవెన్యూ ఇస్తున్నాం. గతంలో పసుపు బోర్డ్ ఇస్తామని.. స్పైస్ బోర్డ్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పసుపు బోర్డు ఇస్తామని చెప్పి.. తెలంగాణలో ఉన్న స్పైస్ బోర్డును తరలించిందుకు చూస్తున్నారు. అదేజరిగితే బోర్డు తరలించకుండా అడ్డుకున్నామని తెలిపారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. కాజిపేట రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాదని చెప్పడం చాలా బాధాకరం… కాజిపేట కంటే చిన్న స్టేషన్లుకు ఇచ్చారు. గతంలో కాజిపేట స్టేషన్ కళకళ ఉండేది..ఇక్కడ ఉన్న రైల్వే స్కూల్‌ను ఇతర వాటిని ఎత్తివేశారు. రైల్వే ఉద్యోగులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కలిసి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం అందరూ కలిసి పోరాటం చేస్తామని ఉద్యోగులు హామీ ఇస్తున్నారని దరయాకర్ తెలిపారు.