సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. !

41

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు సర్జరీ చేయించుకున్నారు. చాలాకాలంగా ఆయన మోకాలినొప్పితో బాధ పడుతున్నారు. ఇటీవల షూటింగ్‌లో ఆయన మోకాలికి గాయమైంది. దీంతో ఆయన మోకాలి నొప్పి మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో ఆయన స్పెయిన్ లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్‌ కుటుంబ స‌మేతంగా స్పెయిన్ వెళ్లారు.

సర్జరీ ముగిసిన అనంత‌రం ఆయ‌న దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్‌ స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. ఆయన లేని స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ చిత్రీక‌రిస్తోంది. 2022, ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల కానుంది.