ఈటల పతనం ప్రారంభమైంది: చల్లా

148
challa

ఈటల వంటి వారు వెయ్యి మంది వచ్చినా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని మండిపడ్డారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ధర్మారెడ్డి…బీజేపీలో చేరిన మ‌రుక్ష‌ణ‌మే ఈట‌ల రాజేంద‌ర్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌యింద‌ని దుయ్యబట్టారు.

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఈటల ఢిల్లీలో తాక‌ట్టుపెట్టారని…ఆయన ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. మ్యానిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాల‌ను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేన‌ని చెప్పారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని వెల్ల‌డించారు.

తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్న బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదరించకుంటే మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడడుండేద‌ని ప్ర‌శ్నించారు.