ఫాం ఆయిల్ రైతులతో బాల్క సుమన్ సమావేశం

196
suman

జైపూర్ లో ఫాం ఆయిల్ సాగు పై జైపూర్ మరియు మందమర్రి మండల రైతులతో అవగాహన సదస్సు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గోన్నారు.

ఈసందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. జిల్లాలోనీ భూములు ఫామ్ ఆయిల్ సాగుకు అనుకూలమైనవన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 16న అశ్వరావు పేట లోని ఆయిల్ ఫాం తోటల పరిశీలనకు చెన్నూరు నియోజవర్గ రైతులు భారీగా తరలి రావాలి అని పిలుపునిచ్చారు.