సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: గద్వాల ఎమ్మెల్యే

25
kcr

ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అల్లంపూర్ ఎమ్మెల్యే డా!! అబ్రహం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.

గట్టు ఎత్తిపోతల పథకాల టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని సోమవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గట్టు ఎత్తిపోతల పథకానికి పనులు శ్రీకారం‌ చేయబోతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ని ,గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి కలిసి గద్వాల నియోజకవర్గ రైతులకు ప్రజల తరఫున, పూలకుండి ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా గద్వాల ప్రాంతం అభివృద్ధి పై భవిష్యత్తులో అన్ని విధాలుగా గద్వాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని సీఎం గారిని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టు మండల ఎంపీపీ విజయ్ కుమార్, ధరూర్ మండల తెరాస పార్టీ సీనియర్ నేత సర్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.