ఈటలకు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూటి ప్రశ్న..?

265
MLA Balka Suman
- Advertisement -

గురువారం ఎమ్మెల్యే బాల్క సుమన్ హుజూరాబాద్‌లో యువకులు, విద్యార్థి నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌పై విమర్శలు చేశారు.

కేసీఆర్‌పై ఈటల చేస్తున్న విమర్శలపై బాల్క స్పందిస్తూ.. తండ్రిలాంటి కేసీఆర్‌ను విమర్శించేందుకు ఈటలకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీలో ఈటల అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. దేశ రైతాంగం నడ్డి విరిచి నల్ల చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ అని విమర్శించిన ఈటల రాజేందర్ ఇప్పుడు అదే పార్టీలో చేరడం దేనికి సంకేతం అని ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యే బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. ఏడేళ్లుగా తెలంగాణకు ఏమీ చేయని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడేదో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

- Advertisement -