భవిష్యత్ తరాల కోసం కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ః ఎమ్మెల్యే బాల్క సుమన్

1164
balka suman
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు భవిష్యత్ తరాల కోసం అన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేతల మెదళ్లు బూజు పట్టాయని..వాటిని దులుపుకోవాలన్నారు.

ఇప్పుడున్న సచివాలయం ఓ ప్రణాళిక లేకుండా ఉందని చెప్పారు. .సరైన పార్కింగ్ వసతులు లేకుండా ,భద్రతా ఏర్పాట్లు చేయడానికి కూడా ఇపుడున్న భవనాలు అనుకూలంగా లేవన్నారు. చిన్న రాష్ట్రాలు కూడా కొత్త నిర్మాణాలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీని పార్లమెంట్ తరహాలో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. సచివాలయం , అసెంబ్లీ భవనాల కట్టడాన్ని ఇప్పుడు విమర్శిస్తున్న నేతలు కట్టిన తర్వాత స్వాగతిస్తారని చెప్పారు.

- Advertisement -