బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకో: బాల్క సుమ‌న్

200
MLA Balka Suman
- Advertisement -

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోళ్ళు చేస్తున్నామ‌ని, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంత‌రం ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ విప్,ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలోనే రైతుల వద్ద నుండి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌న్నారు. ధాన్యం కొనుగోళ్ళలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని స్ప‌ష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో బీజేపీ నేత‌లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ నోరు అదుపులో పెట్టుకోవాలి. రైతు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల‌న్నారు. లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామ‌ని తెలిపారు.

బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోక పోవడంతోనే నాగార్జున సాగర్, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ప్రజలు బుద్ది చెప్పారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు మంజూరు చేయించాలి, వ్యాక్సిన్ పంపిణి విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలని బీజేపీ నేతలను బాల్క సుమ‌న్ డిమాండ్ చేశారు.

- Advertisement -