తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకం కళ్యాణలక్ష్మి. ఈ పథకంలో భాగంగా ఈ రోజు చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, శాదీ ముభారక్ లబ్దీదారులకు చెక్కుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 113 మంది లబ్దీదారులకు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెక్కులను అందజేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో చెక్కులని అందజేసి వారికి పెళ్లి కానుకగా తన సొంత ఖర్చులతో మంచి నాణ్యమైన చీరలని బహుకరించారు ఎమ్మెల్యే బాల్క సుమన్.
అనంతరం వారందరితో కలిసి ఆయన సామూహిక భోజనం చేశారు.చరిత్రలో మొదటి సారి కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు అదనంగా చీరలు ఇచ్చి.. కడుపు నిండ బోజనం పెట్టడం. ఈ కొత్త ఒరవడికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాంది పలికారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి మరియు జడ్.పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఐసిడియస్ కో ఆర్డినేటర్ అత్తి సరోజన, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ప్రవీణ్,చెన్నూర్ భీమారం, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల తహశిల్దార్‌లు,ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అలాగే సర్పంచ్‌లు, పలువురు నేతలు పాల్గొన్నారు.