సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

234
CMRF Checks
- Advertisement -

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలు వరంగా మారిందన్నారు. ఆపదలో ఉన్న వారికి ఇది సంజీవనిలా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎం సహాయ నిధి పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -