నిధులన్ని ఖమ్మంకేనా?:కాంగ్రెస్ ఎమ్మెల్యే

7
- Advertisement -

మరోసారి సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. నిధులన్నీ ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయి అని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, నల్గొండ జిల్లాకు ఎన్ని నిధులు వచ్చాయి.. ఖమ్మం జిల్లాకు ఎన్ని నిధులు వెళ్లాయని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాను అని తెలిపారు.

ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహబూబ్‌నగర్‌ కంటే ఖమ్మం జిల్లాకు నిధులు ఎక్కువ ఎలా ఇస్తారు? చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడన్న వార్తలపై ఘాటుగా స్పందించారు అనిరుధ్ రెడ్డి.

సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని కోసం చంపిన చరిత్ర ఎర్ర శేఖర్‌ది… రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు… పార్టీకి మోసం చేసి మూటలు తీసుకొని వెళ్లిన వారికి మళ్ళీ ఎంట్రీ లేదు అని స్పష్టం చేశారు.

Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..

- Advertisement -