- Advertisement -
భారత్ మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన మిథాలీ… ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో 7 వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు నమోదు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ పరుగు తీసి మైలురాయిని చేరింది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు. మిథాలీ తన కెరీర్లో ఇప్పటివరకు 213 వన్డేలు ఆడగా, 50.7 సగటుతో మొత్తం 7,008 పరుగులు సాధించింది. వాటిలో 7 శతకాలు, 54 అర్ధశతకాలు ఉన్నాయి.
- Advertisement -