గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మిథాలిరాజ్

546
Mithali Raj
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమన్నారు భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్. పర్యవరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మిథాలిరాజ్.. హైదరాబాద్ తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బోరియా మజూందార్, పారిశ్రామిక వేత్త వాణి కోలాతో పాటు.. హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ రాజ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సినీనటి కాజల్ అగర్వాల్.. త్వరలోనే మొక్కలు నాటుతానంటూ రీట్వీట్ చేశారు..ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మిథాలీరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -