- Advertisement -
భారత్‌తో తొలి టెస్టు ముందు ఆసీస్‌కు గుడ్ న్యూస్. స్టార్ బ్యాట్స్ మెన్ వార్నర్ దూరమైనా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎంట్రీ ఇవ్వనున్నారు. డిసెంబరు 4న కాన్బెర్రా వేదికగా భారత్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చివరిగా ఆడిన మిచెల్ స్టార్క్.. అనంతరం తన కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో టీమ్‌ని వీడాడు.
అయితే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మిచెల్ స్టార్క్ సోమవారం మళ్లీ బబుల్‌లోకి రానున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం ఓ ప్రకటనని విడుదల చేశాడు.
2011 నుంచి టెస్టుల్లో ఆడుతున్న మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకూ 57 టెస్టులాడి 244 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న ఈ పేసర్.. ఏకంగా 13 సార్లు 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
- Advertisement -