ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో ఆషెస్ 2025–26 తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై సంచలన ఆరంభం ఇచ్చాడు. మ్యాచ్ తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు.
పెర్త్ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. తొలి సెషన్‌లోనే స్టార్క్ జాక్ క్రాల్లీ, జో రూట్‌లను డక్‌కు పెవిలియన్ పంపి, బెన్ డకెట్‌ను 21 పరుగుల సందర్భంగా ఔట్ చేశాడు.
ఈ వికెట్లతో స్టార్క్ ఆషెస్‌లో 100 వికెట్ల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన 21వ ఆటగాడిగా, అంతేకాకుండా ఈ రికార్డును నమోదు చేసిన తొలి ఎడమచేతి సీమర్‌గా నిలిచాడు. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హజిల్‌వుడ్ జట్టుకు దూరమయ్యారు. కమిన్స్‌కి నడుము వెనుకభాగంలో స్ట్రెస్ ఇంజరీ రావడంతో ఆయన తొలి టెస్టులో పాల్గొనలేదు. మరోవైపు హజిల్‌వుడ్ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, కమిన్స్ రెండో టెస్టుకు తిరిగి వచ్చే అవకాశం ఉండటం ఆస్ట్రేలియాకు శుభవార్త.
Also Read:హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

