సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియన్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేయగా ఈ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
దీంతో దీనిపై స్పందించిన కేటీఆర్.. విజన్ ఉన్న కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ పథకం తెలంగాణలో విజయవంతమైన తర్వాతే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అనే పథకాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. ఇవాళ తెలంగాణ ఏది చేస్తే మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Telangana is The first state in independent India to have launched a project called “Mission Bhagiratha” to provide a potable water connection to every home
Thanks to our Hon’ble CM KCR’s visionary leadership 👍
Inspired by Telangana’s success, Govt of India has launched Har… https://t.co/yeZQonlmA2
— KTR (@KTRBRS) October 12, 2023