మిస్ వరల్డ్ కార్యక్రమాల వివరాలు..

6
- Advertisement -

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ తెలంగాణ, హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

మే 3 నుంచి 8 వరకు వివిధ దేశాల ప్రతినిధుల ఆగమనం.

శంషాబాద్ ఎయిర్ పోర్టుగా తెలంగాణ సంప్రదాయరీతిలో ఆహ్వానం.

మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవం.
జయ జయహే తెలంగాణ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు.

108 దేశాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం.

మే 12న నాగార్జున సాగర్ బుద్దవనం సందర్శన.

మే 13న చార్మినార్ సందర్శన, హెరిటేజ్ వాక్, లాడ్ బజార్ షాపింగ్, చౌముహల్లా ప్యాలెస్ లో విందు.

మే 14న వరంగల్ ఫోర్టు, వేయి స్థంబాల గుడి, రామప్ప సందర్శన.

Also Read:సర్దార్ మృతికి కాంగ్రెస్ పార్టీనే కారణం!

మే 15న యాదగిరిగుట్టలో దర్శనం, చేనేత గ్రామం పోచంపల్లి సందర్శన.

మే 16న హెల్త్ టూరిజం – ఏఐజీ హాస్పటల్ సందర్శన,
మహబూబ్ నగర్ జిల్లాలో చారిత్రక పిల్లలమర్రి టూర్.
హైదరాబాద్ శివారు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన.

మే 17న గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్ ఫినాలే.
సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన.

మే 18న భద్రతపై కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన.
సాయంత్రం పాలనా కేంద్రం సచివాలయంలో కార్యక్రమం.

మే 21 శిల్పారామం.
విక్టోరియా హోమ్ సందర్శన.

మే 22 శిల్పకళావేదికలో టాలెంట్ ఫినాలే.

మే 23 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్.

మే 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ షో.

మే 26 బ్యూటీ విత్ పర్పస్, గాలా డిన్నర్.

మే 27 ఫైనల్ రిహార్సల్స్.

మే 31 మిస్ వరల్డ్ 2025 ఎంపిక, కిరీటధారణ- హైటెక్స్ లో

జూన్ 2 రాజభవన్ లో గవర్నర్ తో భేటీ.

- Advertisement -