కేసీఆర్..విజనరీ లీడర్:ఎర్రబెల్లి

6
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ.. పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు మరియు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు మరియు కేసీఆర్ గారికే దక్కుతుంది అన్నారు. తెలంగాణకు నీటిని తెచ్చిన విజనరీ నాయకుడు కేసీఆర్ గారే. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచిన ఘనత కేసీఆర్ గారిదే. ఆయన నాయకత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించింది.

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు తన గానంతో సభికులను మంత్ర ముగ్ధులను చేశారు.మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, గాదరి కిషోర్, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, జాన్సన్ నాయక్, ముటా జయసింహ, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఆశిష్ యాదవ్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల కేసీఆర్ దూరదృష్టిని కొనియాడుతూ, యువతతో ఘనంగా సమావేశాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్ఎస్ యూఎస్ఏ సమన్వయకర్త తన్నీరు మహేష్ మాట్లాడుతూ.. జూన్ 1న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యూఎస్ఏ యువ నాయకులు ఉదయ్ యాదవ్, సామ్ పుసపల్లి, శశి దోంతినేని, అనిల్ పెండ్యాల తదితరులు నిర్వహించారు. విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన యువత ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:మిస్ వరల్డ్ కార్యక్రమాల వివరాలు..

- Advertisement -