Miss World 2025: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

46
- Advertisement -

మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఉండనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఛార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల లోపు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు. చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

Also Read:‘సార్పట్ట 2’ … క్రేజీ న్యూస్!

- Advertisement -