హీరో విశాల్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం విల్లుపురంలో ట్రాన్స్‌జెండర్ల కోసం నిర్వహించిన మిస్ కువాగం 2025 అందాల పోటీకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు విశాల్. ఈ క్రమంలో వేదికపై ఒక్కసారిగా కుప్పకూలారు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆయన కోలుకోవడంతో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు.వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారని, భవిష్యత్తులో సమయానికి భోజనం చేయాలని సూచించారని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ బాగానే కోలుకుంటున్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన బృందం తెలిపింది.
గతంలో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు విశాల్. ఈ ఏడాది జనవరిలో ‘మద గజ రాజా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే అది జ్వరం వల్ల వచ్చిందని ఆయన అభిమానులకు తెలిపారు.
Also Read:‘సార్పట్ట 2’ … క్రేజీ న్యూస్!

