ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది.. ఫస్ట్ రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది. సెకండ్ రన్నరప్‌గా తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ నిలిచింది. 2018లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు… ఈ ఏడాది తన కిరీటాన్ని సంజనా విజ్‌కి బహుకరించింది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ -2019గా బిహార్‌కు చెందిన శ్రేయా శంకర్ నిలిచారు. మిస్ గ్రాండ్ ఇండియా 2019 టైటిల్‌ను కూడా మిస్ ఇండియా మొదటి రన్నరప్ శివానీ జాదవ్‌కు దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కిరీటం సొంతం చేసుకున్న సుమన్ రావు మాట్లాడుతూ ‘జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే , దాన్ని సాధించడానికి శరీరంలోని అణువణువూ మనకు సహకరిస్తూ విజయం వైపు అడుగులు వేయడానికి దోహదపడుతుందని’ తెలిపారు.
ముంబయిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, నోరా ఫతేహీ, మౌనీరాయ్ ఈ వేడుకలో తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మిస్ వరల్డ్ -2017 మానుషీ చిల్లర్, మనీశ్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. హ్యుమా ఖురేషీ, దియా మీర్జా, నేహా ధూపియా, చిత్రాంగదా సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.