తనని వేశ్య లాగా చూశారు అని… మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ. హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయాలను ప్రముఖ SUN పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ. తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెల్లబోసుకుంది.
సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే, అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేం అక్కడున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. చాలా అగౌరవంగా అనిపించింది. మనల్ని అక్కడ ఎంత తక్కువగా చూస్తున్నారో అర్థమైంది అని తన ఆవేదనను చెప్పుకుంది.
Also Read:కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యం:కోనప్ప

