మిర్జాపూర్..ఓటీటీలో ఓ సెన్సేషన్. ఇప్పటివరకు మూడు సీజన్లు ప్రేక్షకుల ముందుకురాగా తాజాగా ఈ సినిమాను ‘మిర్జాపూర్: ది ఫిల్మ్’ అనే ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందించాలని మేకర్లు నిర్ణయించారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అధికారికంగా పూర్తయ్యింది. చిత్ర నిర్మాణ పనులన్నీ ముగిసినట్లు మేకర్లు వెల్లడించగా, సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. ఈ అప్‌డేట్‌తో పెద్ద తెరపై ఈ క్రైమ్ సాగాను చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల్లో మరింత ఉత్సుకత నెలకొంది.
ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి పరిచిత నటులు కీలక పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పునీత్ కృష్ణ కథ, కథనం అందించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అఖ్తర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

