Mirai:మిరాయ్..ట్విట్టర్ రివ్యూ!

15
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇక ఇవాళ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తేజ సజ్జా నటన, సెకండ్ హాఫ్‌లోని హై మోమెంట్స్, అద్భుతమైన విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకు రెబెల్ వైబ్‌ని తెచ్చిందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌కి భావోద్వేగాలను కలబోసి తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని చెబుతున్నారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. సెకండాఫ్‌లో హై మూమెంట్స్ సినిమాని తప్పకుండా చూసేలా మార్చేశాయి అని చెబుతున్నారు.

ఒక్క వాయిస్ ఓవర్‌తోనే సినిమా మొత్తం రెబల్ వైబ్‌లోకి వెళ్లిపోయింది. మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్. అద్భుతమైన కథనా శైలి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఎంట్సీతో థియేటర్లు అల్లకల్లోలంగా మారిపోయాయి. బీజీఎంతో భూమి కంపించేలా ఉంది అని చెబుతున్నారు. తేజ సజ్జా మరో స్థాయికి వెళ్లడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు.

Also Read:జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

- Advertisement -