- Advertisement -
ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆర్కెపురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ మైనారిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తరబడి మీరు ఇబ్బంది పడుతున్న రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన డివిజన్ మరింత అభివృద్ధి చెందాలి అంటే కారుగుర్తుకు ఓటు వేయాలి మంత్రి అని తెలిపారు.

టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి విజయభారతి అరవింద్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి వలసిందిగా మంత్రి సబితారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి విజయ భారతి అరవింద్ శర్మ మరియు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

