దారులన్నీ ఎల్బీస్టేడియం వైపే!

141
kcr
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీస్టేడియంలో 28న టీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగసభపైనే అందరి కళ్లు ఉన్నాయి. 150 డివిజన్ల నుండి భారీగా జనసమీకరణ చేసేందుకు గులాబీ శ్రేణులు సమాయత్తం అవుతుండగా సీఎం కేసీఆర్ ఏం చెప్పనున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ ద్వారా క్యాడర్‌లో జోష్ నింపడంతో పాటు ప్రజలకు స్పష్టమైన సంకేతాలను ఇవ్వనుంది టీఆర్ఎస్.జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటున్న ఏకైక బహిరంగసభ కూడా ఇదే.ప్రతి డివిజన్‌ నుంచి కనీసం మూడు వేల మందిని ఈ సభకు తరలించేలా ప్లాన్ చేస్తుండగా లాల్‌బహదూర్‌స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల నుంచి పాదయాత్రలుగా ప్రజలను తరలించనున్నారు.

కోవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ సభను నిర్వహించనుండగా సభకు వచ్చేవారి కోసం రెండు లక్షల మాస్కులను సిద్ధం చేశారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక నుంచి సీఎం కేసీఆర్‌ ప్రసంగించనుండగా కుడివైపున ఉన్న వేదికను కళాకారుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తే, ఎడమవైపున ఉన్న వేదికపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కూర్చుంటారు. సాయంత్రం ఆరు గంటలకు సభను ముగించేలా షెడ్యూల్‌ రూపొందించారు.

- Advertisement -