రీయింబర్స్‌మెంట్ పై ఆందోళన వద్దు….

139

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తమ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా విపక్షల సందేహాలను సీఎం నివృత్తి చేశారు. రీయింబర్స్‌మెంట్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ పథకం యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు అనవసరంగా విద్యార్థులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. రీయింబర్స్‌మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అని అది ఆగదన్నారు. విద్యార్థులు, విద్యా సంస్థల సంక్షేమానికి లోటు రానివ్వమని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయని, ప్రభుత్వంలో 3 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉంటారని తెలిపారు.

ప్రజా ప్రతినిథులు విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో లేనిపోని భ్రమలు కల్పించేలా మాట్లాడటం విపక్షాలకు తగదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభంలోనే లోపాలున్నాయని వివరించారు. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలివ్వాలని టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు టీడీపీ ధర్నాల మీద ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు పార్టీలు కలిసి ఇపుడు మళ్లీ ధర్నాలకు కూచుంటున్నాయని విమర్శించారు.

Minorities on par with SCs & STs

తాము అధికారంలోకి వచ్చే నాటికి ఫీజు బకాయిలీలు రూ.1880 కోట్లు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీ ఏడాది రీయింబర్సెమెంట్‌ను పెండింగ్‌లో పెట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రీయింబర్స్‌మెంట్ కోసం ప్రతీ సంవత్సరం రూ.2 వేల నుంచి రూ.2 వేల 5 వందల కోట్ల రూపాయలు అవసరమన్నారు. ఈ సంవత్సరం 1487 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 4,687 కోట్లు కేటాయించామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అవినీతిపై విజిలెన్స్ తో విచారణ జరిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలుగనివ్వమని భరోసా ఇచ్చారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలను ప్రారంభించామని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు హోంగార్డు, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఎస్సీ విద్యార్థినుల కోసం 30 రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రమాణాలు లేని కాలేజీలు వాళ్లే సీట్లు తీసేసుకున్నారు. మేమేం తీసేయించలేదని తెలిపారు.

Minorities on par with SCs & STs

ప్రమాణాలు లేని కాలేజీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రలోభాలకు లొంగమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కొనసాగిస్తామన్నారు. ఇది ఆపేది కానే కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు ఆందోళన అక్కరలేదని స్ఫష్టం చేశారు. విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులు కూడా అనవసర ఆందోళనకు గురికావద్దని కోరారు.