పాతవి తుక్కే..కొత్త వాటికి పన్ను రాయితీ

45
- Advertisement -

సెంట్రల్ మోటర్ వెహికిల్ యాక్ట్‌ ప్రకారం 15సంవత్సరాలు దాటిన ప్రతి ప్రభుత్వ ప్రైవేటు వాహానాలు ఇక నుంచి ఏప్రిల్ 1నుంచి తుక్కుగా పరిగణించనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి రిజిస్ట్రేషన్లు కూడా ఉపసంహరించనున్నారు. ఈ ఉత్తర్వులోని నిబంధన ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సలకు వర్తించనుంది. కొన్ని ప్రత్యేక అవసరాల కోసం అంటే సైన్యం శాంతిభద్రతలు అతర్గత భద్రతల కోసం వినియోగించే వాహానాలకు మినహాయింపు ఇచ్చింది.

2021-22 బడ్జెట్‌లో పేర్కొన్న ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20యేళ్లు వాణిజ్య వాహనాలకు 15యేళ్ల తరువాత సామర్ధ్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం పాత వాహనాలను తుక్కుగా మార్చిన తర్వాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్టు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

ప్రతి 150కిలోమీటర్లకు ఓ తుక్కు కేంద్రం ఏర్పాటు తమ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు తిరగడం తద్వారా కార్బన్‌ఉద్గరాల స్థాయిని తగ్గించే వీలుంటుందని మంత్రి గడ్కరీ గతేడాది తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి…

అర్థంలేని ఆరోపణలు :గుత్తా

ప్రజలు కోరిన చోట శిబిరాలు:హరీశ్‌

ఉసేన్‌ బోల్ట్‌కు రూ. 100 కోట్ల టోకరా!

- Advertisement -