రాష్ట్రంలోని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ క్యూలైన్‌లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే ఓల్డ్ మలక్‌పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి – సునీత దంపతులు, వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 97 నంబర్ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో నగర మేయర్ విజయలక్ష్మి, షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఓట్లు వేశారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్ దంపతులు ఓటు వేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, మహబూబాబాద్ పట్టణం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.