చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు..

106
- Advertisement -

గురువారం మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్‌ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా వారు బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి రాంకీషన్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కే ఆ ఘనత దక్కుతుంది అన్నారు.

బాసర జంక్షన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పరిపాలన, యుద్ద నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శం. మత సామరస్యాన్ని చాటారు. ప్రజలే ప్రభువులుగా పాలించారు.శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదు అని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీ స్ఫూర్తి ఉంది. అహింసా మార్గంలో 14 ఏళ్లు పోరాటం చేసి.. తెలంగాణ సాధించి.. అద్భుత పాలన అందిస్తున్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి మోడల్ అయ్యింది. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బాసర అమ్మవారిని మంత్రి హరీశ్ రావు దర్శనం చేసుకొని, శివాజీ విగ్రహాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. బాసర దేవాలయాన్ని ప్రభుత్వం వంద కోట్లతో అభివృద్ధి చేయనున్నది. రాబోయే రోజుల్లో బాసర పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది.

- Advertisement -