భగీరథ పథకంతో గడప గడపకు సురక్షిత నీరు..

193
Dayakar Rao Errabelli
- Advertisement -

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భగీరథ పథకం ద్వారా గడప గడపకు సురక్షిత నదీ జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని అన్నారు మంత్రులు జగదీష్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావు లు.మిషన్‌ భగీరథ పథకంపై నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రులు జగదీష్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కార్యాలయం సెక్రెటరీ స్మిత సబర్వాల్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఫ్లోరైడ్‌తో నరకయాతన పడ్డ నల్గొండ జిల్లా ప్రజల బాధలను చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రులు అన్నారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లోనే భగీరథ పథకం పైలాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అవిష్కరించారని అన్నారు. నేడు గడప గడపకు కృష్ణా గోదావరి జలాలు వచ్చి చేరాయని, ఫ్లోరైడ్ సమస్య సమసిపోయిందని మంత్రులు అన్నారు.

- Advertisement -