ఎస్పారెస్పీకి కాళేశ్వరం నీళ్లు…కేసీఆర్ ఘనతే

758
prashanth reddy
- Advertisement -

కాళేశ్వరం నీళ్లను ఉత్తర తెలంగాణ ప్రజలు కళ్లారా చూస్తున్నాం. ..సీఎం కేసీఆర్ చేసిన కృషిని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరిన సందర్భంగా పుష్పాభిషేకం చేసిన ప్రశాంత్ రెడ్డి …కాళేశ్వరం గంగను చూసి ఆనంద బాష్పా లు కార్చారు.

కాళేశ్వరం నీళ్లు శ్రీరాం సాగర్ ప్రాజెక్టును ముద్దాడుతాయా అని కళ్ళల్లో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాము…ఆ కల నెరవేరుతోందన్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రేయనగా పగలనక కష్టపడ్డారని…కోటి ఎకరాలకు నిరందించటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ను ప్రతి పక్షాలు తిట్టిండ్రు.పునరుజ్జివనంతో నీళ్లు ఎస్సారెస్పీకి తెస్తామన్నాడు. తెచ్చి చూపింరాని చెప్పారు.

200 కిలో మీటర్ల దూరంలో ఉన్న నీటిని ఎదురు తీసుకొని వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని కొనియాడారు.ఎన్నికలు జరిగి 6 నెలలు కాలేదు ఒకాయన రాజీనామా చేయాలని తొందర పడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ప్రజలను రెచ్చ గొట్టొద్దు. రైతులందరికీ సాగు నీరు అందాలన్నారు.వంద ఏళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు.రాజకీయాల్లో ఉన్నప్పుడే ఏం చేశావు అనేదే ముఖ్యమన్నారు.రైతుల బతుకులు మారినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని…కాళేశ్వరం ప్రాజెక్ట్ మానవ సృష్టి అని గవర్నర్ సౌందరరాజన్ మెచ్చుకున్నారని చెప్పారు వేముల.

- Advertisement -