అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి- మంత్రి

158
minister koppula
- Advertisement -

జీవితాన్ని మెరుగు పరచుకునే నైపుణ్యాల సాధనకు విద్యా ఒక పునాదిరాయి అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఈరోజు కరీంనగర్ జిల్లా చింతకుంటలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యాలయాల సంస్థ రిజియన్ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల నుండి 25 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన సైన్స్ ఫేర్, ఎడ్యుకేషన్ బజార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బిసి వెల్ఫేర్ గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జీవితాన్ని మెరుగు పరచుకునే నైపుణ్యాల సాధనకు అక్షరాస్యత ఒక పునాదిరాయి. పేద, అణగారిన సమూహాల పిల్లలకు విద్యావకాశాలను మెరుగు పరచడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైన ప్రాధాన్యతగా ఉంది. సామాజిక అభివృద్ధిలో అక్షరాస్యత (ప్రాథమిక విద్యా దాకా) సాధించడం ఒక్కటే చాలదు. సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన సహేతుక ఆదాయాలు సంపాదించడం కోసం ప్రాథమిక విద్యా నుంచి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించ వలసిన పరిణామం అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు, అనాథ పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలను కల్పించేందుకు, వీటి సాధనలో ఉన్న అడ్డంకులను తొలగించే లక్ష్యంతో హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ సదుపాయాలను కల్పించడం, పుస్తకాలు, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందిచడం వంటి చర్యల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అని అన్నారు.

2019-2020 విద్యా. సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గ పరిధిలో 119 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినది . ఈ గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాల ప్రజల పిల్లల కోసం ఏర్పాటు చేసినారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎస్సీ లు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ సంవత్సరం 16 వేల 5 వందల 34 కోట్లు కేటాయించారు. ఎస్సీ బాలబాలికల కొరకు వందలాది గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం. తెలంగాణ రాష్ట్ర యువత సామాజికంగా, ఆర్ధికంగా ఆభివృద్ధి చెందడానికి రుణ సౌకర్యం కల్పించా రు. అని అన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ ఈ రోజు నిర్వహించినటువంటి సైన్స్ ఫెయిర్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులను మరొకసారి అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా గొప్పగా నిర్వహించాలని మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతులు ముందుకు పోతున్న విధంగా ఇంతకంటే మరి గొప్పగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరగాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -