నీరా పాలసీ జీఓను విడుదల మంత్రులు..

264
harish
- Advertisement -

సోమవారం నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె టి రామారావు , తన్నీరు హరిష్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లు విడుదల చేశారు. నీరా పాలసీ జీ వోను విడుదల చేస్తున్నందుకు ఎంతో అనందంగా ఉందన్నారు మంత్రులు కె టి రామారావు, తన్నీరు హరీష్ రావు,శ్రీనివాస్ గౌడ్.

ఎన్నికల హామి మేరకు నీరా పాలసీని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి, పాలసీకి కృషి చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె టి రామారావుకి  గౌడ కులస్తుల తరుపున కృతజ్జతలు తెలిపారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ  మంత్రి శ్రీనివాస్ గౌడ్. త్వరలో ప్రభుత్వం తరుపున నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా గీత కార్మికులకు  ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించి ఏ ప్రభుత్వం సాయం చెయ్యలేదు. వారికి కనీసం పట్టుంచుకున్న పాపాన పోలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.

గత ప్రభుత్వాలు నీరా కోసం ఇతర దేశాల్లో తిరిగారు కానీ అమలు చెయ్యలేదు. మా సీఎం కేసీఆర్ గౌడ వృత్తిని కాపాడుకోవటం కోసం తాటి చెట్లను తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా విధిగా పెట్టడం జరిగిందన్నారు మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్‌ అదేశాల మేరకు నీరా అమ్మకాలను హైదరాబాద్‌లో ప్రభుత్వం తరుపున స్టాల్స్ పెట్టి నీరాను అందిస్తామన్నారు. దశల వారిగా అన్ని జిల్లాలలో నీరాను ఉత్పత్తి, సరఫరా చేస్తామన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయిని, అందులో మంచి మెడిసిన్ లక్షణాలు ఉన్నాయి అని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్‌లో నీరా అమ్మకాలకు అనుమతిని ఇవ్వటముపై సీఎం కేసీఆర్ మా గౌడ కులాల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. నీరా లైసెన్స్  గౌడ కులానికి మాత్రమే ఇస్తామన్నారు. నీరాను గీయడం ,అమ్మడం గౌడలు మాత్రమే అమ్మాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు వారి అదేశాల మేరకు ప్రభుత్వం తరపున స్టాల్స్ ను ఏర్పాటు చేసి తెలంగాణ వంటకాలను పెట్టాలని చూస్తున్నామన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వలన షుగర్, మధుమేహ వ్యాధి కూడా తగ్గుతాయని పలు పరిశోదనలో వెల్లడైందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

నీరా ఉత్పత్తి, సరఫరా,అమ్మకాలను వివిధ దేశాలైన కంబోడియా, ఆఫ్రికా ,ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో ఈ ఉత్పత్తి ఎక్కువగా ఉంది.అమెరికాలో ఈ మధ్యలో స్టార్ట్ చేశారన్నారు మంత్రి. తెలంగాణలో వందల సంవత్సరాల క్రీతం  నీరాను ఉత్పత్తి చేసారని,పూర్వ కాలంలో దివ్వఔషదంగా పని చేసిందన్నారు. ప్రస్తుతం అనేక వ్యాధుల కు ఔషధం గా పని చేస్తున్నది అని కెమికల్ ల్యాబరేటరీ నుండి రిపోర్ట్ వచ్చిందన్నారు. సాంప్రదాయ డ్రింక్స్ వలన ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం అదేకాదు గీత జాతి వృత్తుల వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

భవిష్యత్తులో సహజసిద్ధ డ్రింక్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామిని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలను తెలుపుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిరా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. గత నెలలో కేటీఆర్ మా గౌడ కులస్తులకు హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉపాధి తోపాటు, మంచి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని తెలిపారు.  ట్యాంక్ బాండ్ పరిసర ప్రాంతాల్లో మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మొదటి సారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు కేరళ,మహారాష్ట్రలలో ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గౌడ కులస్తులకు మాత్రమే లైసన్సులను ఇస్తామన్నారు, నీరా అనేది ఉపాధి తోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని పేర్కోన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సారధ్యంలో కుల వృత్తులకు పూర్వ వైభవం లబిస్తుందన్నారు.అన్ని కుల వృత్తులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం.రాష్ట్రంలో అన్ని కులాలకు హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తన్నామన్నారు. 80 శాతం జనాభా ఈ వృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు. గత ప్రభుత్వాలు కల్లునే నిషేధం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ తెరిపించారని వెల్లడించారు. నీరా వలన లక్షల మంది బాగుపడుతారని ఆకాంక్షించారు మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యులు శ్రీ గంగాధర్ గౌడ్ గారు, శాసన సభ్యులు శ్రీ కె పి వివేకనంద గౌడ్ గారు, శ్రీ మహిపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ ఛైర్మెన్ శ్రీ రాజేషం గౌడ్ గారు, విద్యా శాఖ మౌళిక వసతుల కల్పనల చైర్మెన్ శ్రీ నాగేందర్ గౌడ్ గారు , ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డా. యస్ కె జోషి గారు, స్పెషల్ సి యస్ శ్రీ సోమేష్ కుమార్ లు  పాల్గోన్నారు.

- Advertisement -