వాణీ దేవికి శుభాకాంక్ష‌లు: మంత్రులు

226
ministers
- Advertisement -

హైద‌రాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన సుర‌భి వాణీ దేవికి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉద్యోగులు, ప‌ట్టభ‌ద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. విద్యావంతురాలిని గెలిపించి మండలికి పంపారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, టిఆర్ఎస్ ప‌ట్ల‌ న‌మ్మ‌కం ఉంచి ఓట్లేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ విజ‌యంతో రాష్ట్రంలో ఎన్నికేదైనా టీఆర్ఎస్‌దే గెలుపని రుజువైంది. ప‌ట్టభ‌ద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల‌కు ఇచ్చిన మాట‌ను సీఎం కేసీఆర్ నిల‌బెట్టుకుంటారు. ఫ‌లితాల‌ను చూసైనా ప్రతిప‌క్షాలు బుద్ధి తెచ్చుకోవాలి. నోటికి వ‌చ్చిన‌ట్లు, అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్న నోళ్ళు ఇప్ప‌టికైనా మూత‌ప‌డాలి. రాజ్యాంగ ప‌ద‌వుల‌ను, ప్ర‌జాస్వామికంగా గుర్తించి, గౌర‌వించాలి అన్నారు. వాణీదేవి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రులు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో సురభి వాణీదేవికి పట్టం కట్టిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల ప్రచారంలో పసలేదన్న వాదనను పట్టభద్రులు నిజం చేశారని పేర్కొన్నారు.

- Advertisement -