ఆర్‌ఆర్‌ఆర్‌.. మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌..

163
rrr
- Advertisement -

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’.ఈ మూవీ నుండి మెగా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది చిత్ర బృందం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఆ రోజున రామ్ చరణ్ మహోగ్రరూపాన్ని చూస్తారని చిత్రయూనిట్ వెల్లడించింది. రామరాజు వస్తున్నాడు… అంటూ ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్-అలియా భట్, ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ జంటలుగా నటిస్తుండగా, కీలకపాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ చాలారోజులు నిలిచిపోగా, ప్రస్తుతం శరవేగంతో చిత్రీకరణ జరుపుతున్నారు. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది.

- Advertisement -