కొత్త సచివాలయం పనుల పురోగతిపై మంత్రి వేముల సమీక్ష..

216
minister vemula
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సెక్రటేరియట్ మరియు మ్యాట్రిస్ మెమోరియల్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహనిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లోని అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇవాళ కొత్త సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరుగుతూ పరిశీలించారు.ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేములకు,అధికారులకు పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను,నిర్మాణ సంస్థను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం,మ్యాట్రిస్ మెమోరియల్ గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు అందరు సమిష్టిగా,సమన్వయంతో పనిచేయాలని,అప్పుడే అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు మ్యాట్రిస్ మెమోరియల్ తెలంగాణ రాష్ట్రానికి ఆత్మగౌరవంగా నిలువనున్నదని,రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నదన్నారు.ఈ చరిత్రాత్మక నిర్మాణాల్లో భాగస్వామ్యమైన అధికారులు కూడా ఎంతో బాద్యతతో పనిచేయాలని అన్నారు.వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పనుల్లో న్యాణ్యతకు పెద్దపీట వేస్తూ.. వర్క్ చార్ట్ ప్రకారం నిర్ణిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి వేముల అన్నారు.నిరంతరం క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి,సెక్రటేరియట్ ఎస్.ఈ లు సత్యనారాయణ,లింగారెడ్డి,పలువురు అధికారులు, ఆర్కిటెక్చర్,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ పాల్గొన్నారు.

- Advertisement -