శాసన సభ 12.. మండలి 8రోజులుః మంత్రి వేముల

475
Minister Vemula Prashanth Reddy
- Advertisement -

ఈనెల 20వ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గవర్నర్ ప్రసంగంపై రేపు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆదివారం ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారని అన్నారు. హోలి పండుగ సందర్భంగా సోమ, మంగళ వారాలు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. 13,14,16,17,18,19తేదీల్లో పద్దుల పై అసెంబ్లీ లో చర్చ జరుగుతుంది.

అనంతంర 20వ తేదిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారని అన్నారు. ప్రతిపక్ష నేతలు అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క లు షార్ట్ డిస్కర్షన్ పెట్టాలని సీఎం ను కోరగా దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. షార్ట్ డిస్కర్షన్ లు వచ్చిన సంఖ్య ను భట్టి 20 వతేది తరువాత మరొక సారి బిఏసి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 13,14 వతేదిల్లో మండలిలో షార్ట్ డిస్కర్షన్ ఉంటుందని అన్నారు. మొత్తం 12 రోజులు అసెంబ్లీ సమావేశాలు.. 8రోజుల శాసన మండలి సమావేశాలు జరుగనున్నట్లు తెలిపారు. సీఏఏ,ఎన్ ఆర్సీ, , ఎన్ పీఆర్ పై అసెంబ్లీ లో చర్చ చేసిన తరువాత వాటికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పారు మంత్రి వేముల.

- Advertisement -