మానాల అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి వేముల

149
minister vemula
- Advertisement -

పాత నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మానాల గ్రామంతో పాటు పరిసర ప్రాంత తండాల గ్రామ పంచాయితీల(ప్రస్తుత రుద్రంగి మండలం,సిరిసిల్ల జిల్లా) అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మానాల గ్రామం,పరిసర తండా ప్రాంతాలతో ప్రత్యేక అనుబంధం ఉందని.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో అండగా నిలిచాయి ఈ ప్రాంతాలు అని మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక దశాబ్దాల అన్యాయానికి గురైంది మానాల.. బాల్కొండ నియోజకవర్గం అయినప్పటికి మానాల గ్రామం,16తండాలు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలో కలిశాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలసిన మానాల,పరిసర ప్రాంత తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇప్పటికే ప్రత్యేక నిధులతో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్,హాస్పిటల్,నూతన PACS సొసైటీ, కమ్యూనిటీ హాల్స్,మహిళా సంఘ భవనాలు,పలు సి.సి,బి.టి రోడ్లు అభివృద్ధి చేసుకున్నాం. మానాల,పరిసర 8 తండా గ్రామపంచాయితీల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా.. కొత్తగా ఏర్పడిన మానాల పిఎసిఎస్ ని కరీంనగర్ డిసిసిబిలో కలపాలని,అక్కడి నుంచే లోన్లు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 42 కోట్లతో మానాల గ్రామం,పరిసర 8 తండాల గ్రామ పంచాయితీలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినం..కొన్ని పనులు పూర్తి కాగా కొన్ని పనులు జరగాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా,రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విభాగాల అధికారులు, ఆయా గ్రామ పంచాయతీ ల సర్పంచ్ లు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -