ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం: ప్రశాంత్ రెడ్డి

181
prashanth reddy
- Advertisement -

నిజామాబాద్‌లో టీఎన్జీవోస్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డోనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వేముల.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్పారు.

టీఎన్జీవోలు ప్రభుత్వంలో భాగస్వాములే…ఆరేళ్ళ కాలంలోనే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ కాలంలో అతి పెద్ద సంక్షేమ ఫలాలు తెలంగాణలో అందుతున్నాయని చెప్పారు.

సంక్షేమంలో ఇవాళ దేశంలో తెలంగాణ టాప్ పొజిషన్‌లో నిలిచిందని మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించిందన్నారు.

- Advertisement -