పెద్దపల్లి,జహీరాబాద్‌లో టీఆర్ఎస్‌ నేతల సంబరాలు

175
vemula-prashanth-reddy

పెద్దపల్లి,జహీరాబాద్ పార్లమెంట్ స్ధానాల్లో టీఆర్ఎస్‌ గెలుపుతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.పెద్దపల్లి ఎంపీగా బోర్లకుంట వెంకటేష్ నేత గెలిచిన సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టపాసులు పేల్చి,ర్యాలీ నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు. అనంతరం బస్టాండ్‌ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పూలమాల వేశారు ఎంపీ వెంకటేష్‌. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే లు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్ , బాల్క సుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు , గ్రంధాలయా చైర్మెన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన బిబి పాటిల్‌కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ మీద నమ్మకంతో జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పాటిల్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ,కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.