నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎంపీ అరవింద్ కు అబద్దాలు చెప్పడం అలవాటు అయిపోయిందన్నారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన నాపై చేసిన ఆరోపణలకు నేను స్పందించి నా సమయాన్ని వృధా చేసుకోలేనన్నారు. కానీ ఒక్క విషయానికి మాత్రం సమాధానం చెప్పదలుచుకున్నట్లు తెలిపారు.
రహదారుల నిర్మాణానికి గత 4 సంవత్సరాలలో నిజామాబాద్ జిల్లాకి కేంద్రం 200 కోట్లు ఇస్తే వాటిని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి గా నేను కాళేశ్వరం ప్రాజెక్టుకు,మిషన్ భగీరథ కు మళ్లించానని..200 కోట్లు దోచుకున్నానని ఆరోపణలు చేశారు. దానికి మంత్రి వేముల సమాధానం ఇస్తూ.. ఎంపీ గారు…కేంద్రం రోడ్ల కోసం ఇచ్చిన ప్రతిపైసా రోడ్ల కోసమే ఖర్చు చేసాం.చిల్లిగవ్వ కూడా ఎక్కడికి మళ్లించలేదు.ఒక్క రూపాయి కూడా ఎవరూ దోచుకోలేదు. మీరు ఎంపీ కదా..! కేంద్ర ప్రభుత్వం మీదే కదా…! చేతనైతే నీవు చేసిన ఆరోపణలు నిరూపించు.. అనవసరమైన రాజకీయాలు చేస్తూ అభివృద్ధి చేసే వారి కాళ్లలో కట్టే పెట్టె ప్రయత్నాలు మానుకోవాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.