ప్రతీ గ్రామం హరితవనంగా మారాలిః మంత్రి పువ్వాడ అజయ్

220
puvvada
- Advertisement -

హరితహారం కార్యక్రమంతో ప్రతీ గ్రామం హరితవనంగా మారాలి అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…6వ విడత హరితహారంలో మొక్కలు నాటి బ్రతికించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. దేశంలో మన ఒక్క రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రైతులు సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతు కమిటీలతో పాటు రైతు వేదికలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు కూడా ఇక్కడి నుంచి తమ భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రతి రైతుకు రైతుబంధు ద్వారా వారి వారి అకౌంట్లలో డబ్బులు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే అన్నారు.

- Advertisement -