వలస కార్మికులను పలకరించిన మంత్రి వేముల

397
Minister Vemula Interacted With Migrant Workers
- Advertisement -

నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వెళ్తుండగా మార్గమధ్యలో లాక్ డౌన్ నేపథ్యంలో తమ సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

దారి వెంట మండు టెండలో చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసి చలించిపోయిన ఆయన తన సొంత ఖర్చులతో గత మూడు రోజులుగా భోజనం పెట్టి, రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి మహారాష్ట్ర బార్డర్ వరకు వలస కార్మికులను పంపిస్తున్నారు.

Minister Vemula Interacted With Migrant Workers

ఆదివారం బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం, భోజన సదుపాయాలు మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా వలస కార్మికులను ఆత్మీయంగా పలకరించి వారితో మాట్లాడారు.

- Advertisement -