- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, తొలి వ్యాక్సిన్ తీసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు అజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు.కరోనా మహమ్మారి నివారణకు ఎంతోకష్టపడి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,ఎమ్మెల్సీలు ఆకుల లలిత,రాజేశ్వరరావు, మేయర్ నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,డిఎంహెచ్ఓ పలువురు వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -