క్రీడా శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష..

115
minister srinivas goud

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో క్రీడా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లాల్ బహదూర్ స్టేడియంలో బాస్కెట్ బాల్, స్కెటింగ్ క్రీడా గ్రౌండ్ వినియోగంపై క్రీడాకారుల మధ్య ఏర్పడిన సమస్యను వెంటనే పరిష్కరించాలని క్రీడా శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస రాజును ఆదేశించారు.

లాల్ బహదూర్ స్టేడియంలో బాస్కెట్ బాల్, స్కేటింగ్ క్రీడా మైదానం క్రీడాకారుల వినియోగంపై క్రీడాకారులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం కోసం క్రీడాకారుల అభిప్రాయంను గౌరవిస్తూ సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని మంత్రి క్రీడా శాఖ అధికారులను ఈ సందర్భంగా కోరారు. బాస్కెట్బాల్, స్కేటింగ్ క్రీడకు కు చెంది లాల్ బహదూర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న సుమారు 50 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులతో వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడా శాఖ అధికారులు వెంకయ్య, ధనలక్ష్మీ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.