పర్యాటక రంగం అభివృద్దిపై మంత్రి సమీక్ష..

167
Minister V Srinivas Goud

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు (సెప్టెంబర్ 27, 2020) పర్యాటక స్టేక్ హోల్డర్స్, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెలర్స్ మొదలైన వారితో వెబీనర్ ద్వారా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో. కె.వి. శ్రీనివాస రాజు, IAS,కార్యదర్శి (పర్యాటక & సంస్కృతి), శ్రీ. M.J. అక్బర్, IFS., చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వరంగల్, శ్రీ. బి. మనోహర్, మేనేజింగ్ డైరెక్టర్, టిఎస్టిడిసి, శ్రీ. ఎం. హరికృష్ణ, డైరెక్టర్, సాంస్కృతిక శాఖ, శ్రీ. చిన్నమ్ రెడ్డి, డైరెక్టర్ NITHM మరియు శ్రీమతి. ఇండియా టూరిజం హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్రుప దత్తా తదితరులు పాల్గొన్నారు.

యునైటెడ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) వారు ఈ సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు “గ్రామీణ పర్యాటక అభివృద్ధి” అనే థీమ్ ను ఇచ్చింది. ఈ వెబినార్ లో, పర్యాటక మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక రంగం యొక్క పరిధి, అవసరం మరియు వృద్ధిపై లోతైన సమాచారం గురించి వివరించడం జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, సందర్శించే పర్యాటకుల అవసరాలను తీర్చడానికి వివిధ టూరిజం ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభివృద్ధి చేస్తుంది. తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, కాకతీయ కోట, రామ్మప్ప ఆలయం మరియు వరంగల్ వద్ద వెయ్యి స్తంభాల ఆలయాలు వారసత్వ ప్రదేశాలు గా వున్నవి.

తెలంగాణ పర్యాటక శాఖా టూరిజం అభివృద్ధి కొరకు అన్నీ కార్యక్రమాలను చేపడుతోంది మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో అభివృద్ధి చేయబడుతుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో, ప్రతి సంవత్సరం ఆతిథ్య మరియు పర్యాటక రంగంలో రాణించిన పర్యాటక స్టేక్ హోల్డర్స్ కు తెలంగాణ పర్యాటక రంగం వివిధ విభాగాలలో గౌరవాలు మరియు అవార్డులు ఇస్తుంది.

ములుగు జిల్లాలోని గట్టమ్మ, మేడారం, మల్లూరు, బొగత జలపాతాల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వసతి యూనిట్లు, రెస్టారెంట్లు మరియు టూరిజం ఇన్ఫర్మేషన్ కౌంటర్ల నిర్మాణం వంటి అవసరాలు మరియు అభివృద్ధి మౌలిక సదుపాయాలపై తెలంగాణ పర్యాటకం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రదేశాలతో పాటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రామ్మప్ప, పాకాలా, జన్నారాం వంటి గ్రామీణ పర్యాటక ప్రాంతాలలో తెలంగాణ పర్యాటకం అభివృద్ధిని చేయడం జరిగింది.

తమ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడిని వారి గ్రామంలో ఉన్న గొప్ప వారసత్వం, కళ, సంస్కృతి మరియు గ్రామీణ పర్యాటక రంగం గురించి ఒక బుక్ గా ప్రచురించి గవర్నమెంట్ కు పంపినట్లైతే అందులో ఉన్నత ప్రచురణను తదుపరి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో అవార్డు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సలహాలు మరియు సూచనలతో తెలంగాణ టూరిజం ప్రతి మునిసిపాలిటీ పరిధిలోని పెద్ద పెద్ద చెరువుల దగ్గర స్థలాలను అభివృద్ధిని చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఇటీవల అభివృద్ధి చెందిన దుర్గం చెరువు వంతెన అభివృద్ధి. ఇలాగే రాష్ట్రంలోని అన్నీ సరస్సుల అభివృద్ధి జరుగుతుంది.

ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళేశ్వరం, మిడ్ మానేర్ డ్యామ్, సుండిల్లా, మొదలైన ప్రధాన జలాశయాల చుట్టూ పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. యాదగిరిగుట్టలోని లార్డ్ నరసింహ స్వామి ఆలయం భవిష్యత్తులో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రంగా ఎదుగుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఈ సంధర్భంగా తెలియజేశారు. గ్రామీణ పర్యాటక అభివృద్ధి కొరకు తెలంగాణ టూరిజం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తద్వారా వెంటనే ఉపాధి కల్పనను సృష్టిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ప్రభావం చూపుతుందని కూడా మంత్రి తెలియజేశారు.

అవార్డు పొందినవారు ఈ క్రింది విధంగా ఉన్నారు:

Sl.No. Category Name of the awardee

1.Classified Hotel (5 Star) Taj Falaknuma Palace

2.Classified Hotel (4 Star) within Hyderabad The Golconda Hotel

3.Classified Hotel (4 Star) other than Hyderabad Aalankrita Resorts & Spa
Sitara Hotel, Ramoji Film City

4.Classified Hotel (3 Star) within Hyderabad Minerva Grand, Secunderabad
Hotel Abode By Shree Venkateshwara Lodge

5.Best Wayside Amenities/Motel (other than Hyderbad OPDSS Hotels & Resors Pvt. Ltd.
Vivera Hotels & Resprts (P) Ltd., Narketpally

6.Best Tour operator R.V. Tours and Travels (P) Ltd.

7.Best Travel Agent Southern Travels Pvt. Ltd.

8.Best Restaurant other than Hyderabad 7 Food Court