- Advertisement -
అవును యూరియా కొరత నిజమేనని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కొరత కారణంగా రైతులకు సరిపడా యూరియాను ఇవ్వలేక పోతున్నాము అన్నారు.
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయింది… యూరియా లోటును దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలి అన్నారు.
యూరియా కోసం రైతులు క్యూలైన్లలో రోజుల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రైతుల ఆగ్రహానికి గురయ్యాయి. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడింది అబద్దం… యూరియా కోసం రైతులు లైన్లో నిలబడ్డట్టు, చెప్పులు లైన్లో పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎరువులు దొరకనట్లు ఆర్టిఫిషల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read:జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్ ధ్వంసం!
- Advertisement -

