ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తాం అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తుమ్మల. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు అన్నారు. పెసల కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోళ్లు పరిశీలించారు.
రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు గిట్టుబాటు కు అమ్ముకోవడం లో మార్కెట్ లో సౌకర్యాలు ఉండాలన్నారు. రైతులు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు అన్నారు.
ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు పెండింగ్లో వున్న ఇతర బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్‌ని కోరామన్నారు మంత్రి సీతక్క. రాజ్ భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సీతక్క…ఆదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేశామన్నారు. అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని కోరాం అన్నారు.
జిష్ణు దేవ్ వర్మ కు ములుగు లో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్ కు పంపాము, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు అన్నారు.
Also Read:ప్రకాశ్ రాజ్, కార్తీపై పవన్ సీరియస్